తెలుగు భాష తియ్యదనాన్ని సాహిత్యంగా అందుకొని తన గంధర్వ గానస్వరముతో ప్రపంచ తెలుగు శ్రోతల హృదయాలలో అమరజీవిగా నిలిచిన పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా స్థానిక రాజీవ్ పార్కులో పద్మశ్రీ ఘంటసాల సంగీత సాంస్కృతిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు గాయకులు మధుర గీతాలు ఆలపించి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం తెలుగు భాష పరిరక్షణ కోసం గుంటూరులో జనవరి 3, 4, 5 తేదీలలో జరుగు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహణలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభల “ఆత్మీయ ఆహ్వాన కరపత్రం” తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు టివి రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పుర ప్రముఖులు ,గాయకుల చేత కరపత్రం ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు గాయకులు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్టార్ డాక్టర్ సుధాకర్ బాబు ,సీనియర్ కవి గాయకులు డాక్టర్ జాకర్లపూడి శ్యామసుందర శాస్త్రి ,ఓబుల దాసు, ఘంటసాల విగ్రహ వ్యవస్థాపకులు రామయ్య, కేశవ ,రామాంజనేయులు, రవికుమార్ ,దుర్గాప్రసాద్, భాస్కరరావు ,తదితరులు ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరిస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
