ఆంధ్ర సారస్వత పరిషత్తు
తొలి తెలుగు గజల్ గాయకుడు, 125 ప్రపంచ భాషలలో గానం చేసి, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన డా.గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన 2017 లో ఆంధ్ర (తెలుగు) సారస్వత పరిషత్తు ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఉత్పన్నమైన స్థానిక కారణాల వల్ల ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు తెలంగాణా సారస్వతపరిషత్తు గా రూపాంతరం చెందింది.
