ఈరోజు మంథని అంబేద్కర్ చౌరస్తాలో కవులు, రచయితలు, మేధావులు, సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవి డా.దూడపాక శ్రీధర్ మాట్లాడుతూ జనవరి 3, 4, 5 తేదీల్లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. తెలుగును బ్రతికించడం కోసం తెలుగు సమాజం కృషి చేయాలని అన్నారు. కలంపట్టి రాస్తున్న కవులు, రచయితలకు సమాజం మద్దతుగా నిలవాలని అన్నారు. లలిత కళలైన కవిత్వం, గానం, చిత్రలేఖనం,శిల్పం లాంటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మరియు కవి గడిపెల్లి అజయ్, సామాజిక కవి మంథని సాయి త్రివిక్రమ్, లెక్చరర్ మారుపాక చంద్రశేఖర్ సామాజిక కార్యకర్త సర్వర్ పాల్గొన్నారు.
