బాలల ప్రపంచ తెలుగు మహా సభలు – 2026
ఆయోజకులు ఆంధ్ర సారస్వత పరిషత్తు
తేదీలు : 5, 6 డిసెంబర్ 2026
వేదిక : నెక్ట్స్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్
1.నేపథ్యం
2.లక్ష్యాలు
3.కార్యాచరణ ప్రణాళిక
4.భాగస్వామ్యం

నేపథ్యం (Background)
తెలుగు భాష భారతదేశంలోని ప్రముఖ ప్రాచీన భాషలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది తెలుగు ప్రజలు నివసిస్తున్నప్పటికీ, ఆధునిక జీవన విధానాలు, ఆంగ్ల భాషా మాధ్యమ ప్రభావం , డిజిటల్ మార్పుల కారణంగా బాల బాలికలలో మాతృభాష పట్ల ఆసక్తి కలిగించే వాతావరణం, పరిస్థితులు లేవు.
ఈ స్థితిని గమనించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు, బాల బాలికలలో తెలుగు భాష పట్ల అవగాహన, అనురాగం, స్వాభిమానం, బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో బాలల ప్రపంచ తెలుగు మహా సభలు – 2026 నిర్వహించడానికి సంకల్పించింది.

లక్ష్యాలు (Objectives)
16 ఏళ్ల లోపు బాల బాలికలలో మాతృభాషపై అవగాహన, ప్రేరణ, అనురాగం, బాధ్యతను పెంపొందించడం
- తెలుగు భాషను ఒక స్వాభిమాన ప్రతీకగా భావించేలా తీర్చిదిద్దడం
- నగరాలు, పట్టణాలలో తెలుగు భాషా ఉద్యమాన్ని బలపరచడం
- ప్రతిభావంతులైన బాల బాలికలను గుర్తించి శాస్త్రీయ శిక్షణ అందించడం
సంప్రదాయ కళలు – ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా తెలుగు వికాసాన్ని చూపించడం - తల్లిదండ్రులు, సమాజంలో భాషా చైతన్యాన్ని కలిగించడం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల బాలలతో అనుసంధానం

కార్యాచరణ ప్రణాళిక (Action Plan)
3.1 సంవత్సర కాల అవగాహన కార్యక్రమాలు
ఒక సంవత్సర కాలంలో క్షేత్రస్థాయి నుంచి నగర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు
– యువతతో ప్రత్యేక బృందాల ఏర్పాటు
– పాఠశాలలు, కళాశాలలలో తెలుగు భాషా కార్యక్రమాలు
3.2 : 15 రోజుల రెసిడెన్షియల్ వర్క్‌షాపులు
ఎంపికైన బాల బాలికలకు క్రింది అంశాలపై శిక్షణ:
అవధానం
పద్యం, గద్యం, కథ, నవల, కవిత
ఆధునిక కవితా రీతులు
గీతం, గేయం, లలిత సంగీతం
చలన చిత్ర సంగీత గానం
వక్తృత్వము
నాటికలు, కవి సమ్మేళనం
బుర్రకథ, హరికథ
కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం
తెలుగు భాష డిజిటలైజేషన్
సామాజిక మాధ్యమాల్లో తెలుగు వికాసం

అంతర్జాతీయ & రాష్ట్రేతర భాగస్వామ్యం
అంతర్జాతీయ & రాష్ట్రేతర భాగస్వామ్యం
విదేశాల తెలుగు సంఘాల బాల బాలికలకు కళా ప్రదర్శనల ఆహ్వానం
రాష్ట్రేతర తెలుగు సంఘాలతో సమన్వయం
గ్లోబల్ తెలుగు సంస్కృతిని వేదికపై ప్రతిబింబించడం
5.ప్రధాన వేదికలు & ప్రదర్శనలు వేదికలు
6.ప్రధాన కార్యక్రమాలు (Key Events)
7.ప్రచార వ్యూహం (Promotion Strategy)

ప్రధాన వేదికలు & ప్రదర్శనలు
వేదికలు
ప్రధాన వేదిక – బాల బాలికల కళా ప్రదర్శనలు
కవి సమ్మేళన వేదిక
“పాడనా తెలుగు పాట” వేదిక
ప్రదర్శన శాలలు
హస్తకళలు
పురాతన నాణేలు
తాళపత్ర గ్రంథాలు
శాసనాల ప్రదర్శన
బాల సాహిత్య పుస్తక ప్రదర్శన
*ప్రత్యేక ఆకర్షణలు
AI & Augmented Reality ద్వారా తెలుగు వికాస మందిరం
తెలుగు వెలుగుల ప్రదర్శన శాల
* చిత్రలేఖనం, కార్టూన్ల ద్వారా తెలుగు వికాసం
* “ఆంధ్ర మేవ జయతే – ప్రతి నోటా తెలుగు మాట” అంశ ప్రదర్శనలు
* సామాజిక అంశాలపై వీధి నాటికలు
కోలాటాలు, కత్తి సాము, బొమ్మలాట

ప్రధాన కార్యక్రమాలు (Key Events)
రెండు అవధానాలు
రెండు నాటికలు
రెండు పౌరాణిక నాటికలు
రెండు హరికథలు
రెండు బుర్రకథలు
1200 మంది బాల బాలికలతో కవి సమ్మేళనం – అమ్మా నాన్నల సమక్షంలో వేదిక పై
.
* 100 మంది బాల బాలికలచే కోరోకే ద్వారా సినిమా గాన ప్రదర్శన
* 100 మంది బాల బాలికలచే కథా పఠనం
వేలాది మంది బాల బాలికలతో నృత్య ప్రదర్శనలు
జానపద కళా ప్రదర్శనలు
బాల బాలికలు వ్రాసిన కథలు, నవలలు, కవితల సంపుటి ముద్రణ
మూడు వీధి నాటికలు
1000 మంది తో అన్నమయ్య సహస్ర గళార్చన
రెండు శాస్త్రీయ సంగీత కచేరీలు
ఆధ్యాత్మిక ప్రవచనం

ప్రచార వ్యూహం (Promotion Strategy)
ప్రత్యేక వెబ్సైట్
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు
ప్రత్యేక ప్రచార గీతం – వీడియో రూపంలో
పోస్టర్ & లోగో ఆవిష్కరణ
మీడియా భాగస్వామ్యం
8.నిర్వహణ & పరిపాలన
9.కమిటీల ఏర్పాటు
10.సహకారం
11.ముగింపు (Conclusion)
నిర్వహణ & పరిపాలన (Management Structure)
అధ్యక్షత

డా. గజల్ శ్రీనివాస్
………..
ముఖ్య గౌరవ సలహాదారులు

డా. మురళీధర్ రెడ్డి
……….

శ్రీ శ్రీకాంత్

కమిటీల ఏర్పాటు
కార్యక్రమ నిర్వహణ కమిటీ
ఆర్థిక కమిటీ
ప్రచార కమిటీ
శిక్షణ & ఎంపిక కమిటీ
వేదిక & లాజిస్టిక్స్ కమిటీ
ప్రదర్శన శాలల కమిటీ
భోజన సదుపాయ కమిటీ
రవాణా & ప్రయాణ ఏర్పాట్ల కమిటీ
ఆహ్వాన పత్రిక కమిటీ
ప్రవాస , రాష్ట్రేతర తెలుగు సంఘాల సమన్వయ కమిటీ
సామాజిక మాధ్యమ ప్రచార కమిటీ
పత్రికా మిత్రుల సమన్వయ కమిటీ

సహకారం (Support & Sponsorship)
నెక్ట్స్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఒంగోలు
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు
వ్యాపార & వాణిజ్య సంస్థలు
దాతలు, శ్రేయోభిలాషులు

ముగింపు (Conclusion)
బాలల ప్రపంచ తెలుగు మహా సభలు – 2026
కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు;
ఇది తెలుగు భాష భవిష్యత్తుకు పునాది.
బాల బాలికల హృదయాలలో తెలుగు భాషను నాటే ఒక మహత్తర ఉద్యమం.

