ఆంధ్ర సారస్వత పరిషత్తు

ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి స్థాపించబడిన ఒక సంస్థ. ఇది 1911లో మద్రాసులో ప్రారంభమైంది. 1919-20లో కాకినాడకు మార్చబడింది. 1943లో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ 1949లో ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మారింది. 

 లోకనంది శంకరనారాయణరావు, బూర్గుల రంగనాథరావు,  సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు, పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అడవి బాపిరాజు వంటి మహామహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారాన్ని విశాలాంధ్ర అంతటా విస్తరించి విశాలాంధ్రోద్యమాన్ని వేగతరంచేశారు. ముఖ్యంగా దేవులపల్లి రామానుజరావు ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశారు.

 ఈ పరిషత్తు తన కార్యకలాపాలతో తెలంగాణా ప్రజల్లో సంచలనాత్మక అస్థిత్వ చైతన్యాన్ని కలిగిస్తే ఉలిక్కిపడిన నిజాం, ముస్లిం/ఉర్దూ దురహంకారులు, గుండాలు పరిషత్తు సమావేశాలకు ఎన్నో ఆటంకాలు కలిగించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నిజాం రజాకార్ల (ముస్లిం దురహంకార స్వచ్ఛంద సైనికుల) అణచివేత చర్యలు తీవ్రతరం కావడంతో 16 నెలలు అజ్ఞాతవాసం చేసిన పరిషత్ పోలీస్‌చర్య అనంతరం నిజాం రాష్ట్రం భారతదేశంలో కలవడంతో నూతనోత్సాహంతో తన 5వ సమావేశాన్ని తూప్రాన్లో జరుపుకొంది. ఆంధ్ర సారస్వత పరిషత్ తన సేవలను తెలంగాణాతో పాటు ఆంధ్ర, రాయలసీమలకు, బీదర్, గుల్బర్గా, బెంగుళూరు, రాయచూర్ మొదలైన కర్ణాటక ప్రాంతాలకు, సేలం, హోసూర్, కె.జి.కండ్రిగ, మద్రాస్ మొదలైన తమిళ ప్రాంతాలకు, బొంబాయి, పూనా, షోలాపూర్, నాందేడ్, దేగ్లూర్ మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలకు, మారిషస్ దేశానికి కూడా విస్తరించింది.

 డా. సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగుభాష వికాసానికి ఎంతో కృషి జరిగింది.

Need Help? Chat with us