Andhra Logo-Tel
తొలి తెలుగు గజల్ గాయకుడు, 125 ప్రపంచ భాషల లో గానం చేసి, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన డా.గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన 2017 లో ఆంధ్ర (తెలుగు) సారస్వత పరిషత్తు ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఉత్పన్నమైన స్థానిక కారణాల వల్ల ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణా సారస్వత పరిషత్తు గా రూపాంతరం చెందింది.
ఆంధ్ర ప్రదేశ్, మరియు ఇతర ప్రాంతాలలో తెలుగు భాషా వికాసం యెుక్క బాధ్యత ను గుర్తించి డా.గజల్ శ్రీనివాస్ నాయకత్వం లో డా.కడిమిల్ల వరప్రసాద్ సహస్రావధాని ,
మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఎస్ రాయప్రోలు భగవాన్, పోన్నపల్లి శ్రీరామరావు, చక్రావథానుల రెడ్డప్ప ధవేజి, శ్రీ రామ కుమార్ రాజు సభ్యులుగా ఆంధ్ర (తెలుగు )సారస్వత పరిషత్తు పునరుద్ధరణ భీమవరం పట్టణం లో జరిగింది.
తెలంగాణా సారస్వత పరిషత్తు ను మాతృ సంస్థగా భావిస్తూ తెలుగుభాషలోని అనేక సాహితీ ప్రక్రియలపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు, పోటీలు, చర్చలు నిర్వహిస్తూ అతి కొద్ది సమయంలోనే ఒక అత్యున్నత సంస్థ గా గొప్ప పేరు సంపాదించుకొని ఆంధ్ర మేవ జయతే! అన్న నినాదంతో ముందుకుసాగుతున్నది.
ముఖ్యంగా బాల బాలికలలో, యువతీ యువకులలో తెలుగు భాష పై మరింత అనురాగం , బాధ్యత కలిగే దిశగా పెక్కు కార్యక్రమాలు చేపట్టింది.
ప్రభుత్వాల నుండి ఎటువంటి నిధులు ఆశించకుండా తెలుగు భాష , ప్రజలకు మమకార భాష కావాలని, ప్రజలే తెలుగు భాషకు నాయకత్వం వహించాలని ఎన్నో గొప్ప అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పరిషత్తు.
తెలుగు ప్రజల కలయికకు వేదికగా ప్రపంచ తెలుగు మహా సభలకు శ్రీకారం చుట్టింది.
2022 భీమవరంలో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు వేలాది మంది సమక్షంలో ఎంతో విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందింది. 2024 లో శ్రీ రాజ రాజ నరేంద్రుల వారి సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరములో రెండు లక్షలమంది సమక్షంలో ఎంతో గొప్పగా రెండవ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించి చరిత్ర సృష్టించింది. 3 వ ప్రపంచ తెలుగు మహా సభలు గుంటూరు అమరావతి లో 2026, జనవరిలో నిర్వహించే దిశగా ముందుకు సాగుతోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కలెక్షన్
తొలి తెలుగు గజల్ గాయకుడు, 125 ప్రపంచ భాషల లో గానం చేసి, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన డా.గజల్ శ్రీనివాస్
Certificates
Certificates
Certificates
