3 వ ప్రపంచ తెలుగు మహా సభలకు స్వాగతం

ఆంధ్ర సారస్వత పరిషత్ , ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి, మరియు విశ్వవ్యాప్తికి అంకితంగా నిర్వహించబడుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3 నుండి 5వ తేదీ వరకు గుంటూరులోని శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం ( హైవే) లో శ్రీ నందమూరి తారకరామారావు వేదిక పై జరుగనున్నాయి.

దేశ విదేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి తెలుగు ప్రతినిధులు , చలన చిత్ర , సాహితీ, సాంస్కృతిక కళాకారులు, కవి సమ్మేళనాలు, సదస్సులు, హస్త కళల, పుస్తక, చిత్ర కళల ప్రదర్శనలు, ఆధ్యాత్మిక వేదిక. వేలాది మంది యువత తెలుగు సంస్కృతిపై కళా ప్రదర్శనలు జరుగనున్నాయి.

తెలుగు మహా సభలకు మీకు మా హృదయ పూర్వక ఆహ్వానం. మహా సభల మూడు రోజులు మాతో గడపి మాకు స్ఫూర్తిని కలిగించవలసినదిగా ప్రార్థన. మీతో అనుబంధంగా వున్న సంస్థలకు, కవులకు , విద్యార్థులకు కూడా మా సభక్తిక ఆహ్వానాన్ని మీ ద్వారా తెలుపగలరు.

మీ రాక సమాచారాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా మాకు తెలియజేయండి.

మేము మీకు అందించగల సేవలు

  • నమోదుకు ఏ రుసుము చెల్లించనఖ్ఖరలేదు

  • వసతి నుండి వేదిక ప్రాంగణానికి స్థానిక రవాణా ఏర్పాట్లు.
    మోదుకు ఏ రుసుము చెల్లించనఖ్ఖరలేదు

  • మహా సభల మూడు రోజులు ఉచిత అల్పాహార, భోజన సదుపాయం.                  ( భోజనం టోకెన్స్ ఇవ్వబడును)

  • డార్ మెంటరి వసతి . పరుపు, టాయిలెట్స్ సదుపాయం ఇవ్వబడును. ఎవరి టాయిలెట్ కిట్ వారే తెచ్చుకొనవలెను. ( వేడి నీళ్ళ సదుపాయం కుదరదు).

  • స్త్రీలకు, పురుషులకు వేరు వేరు డార్ మెంటరీ ల ఏర్పాటు.

  • నమోదు చేసుకొని , పాల్గొన్న వారికి అభినందన పత్రము ఇవ్వబడును.

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో

శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ, అమరావతి ప్రాంగణం గుంటూరు హై వే లో ఆంధ్ర ప్రదేశ్ గడ్డపై అతి పెద్ద తెలుగు పండుగ
3 వ ప్రపంచ తెలుగు మహా సభలు – 2026 విశేషాలు
3,4,5 జనవరి 2026.

ప్రవేశం, నమోదు ఎలా ?

ప్రవేశ రుసుము లేదు . ఆసక్తి కలవారు
వచ్చి తెలుగు మహా సభలలో పాల్గొని సాహిత్య, సాంస్కృతిక కార్య క్రమాలు తిలకించవచ్చు.. ఒక తెలుగు సాహితీ కుంభ మేళా గా తెలుగు మహా సభల నిర్వహణ. ఈ వేడుక, వేదిక తెలుగు వారి అందరిదీ!

ప్రధాన వేదికపై సభలు & సాంస్కృతిక వైభవం

నందమూరి తారక రామారావు ప్రధాన వేదికపై ఉదయం 8 గంటల నుండి వేలాది మంది యువతీ యువకులు, విశ్వ విద్యాలయాల, కళా శాలల , పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో ఉర్రూత లూగించి, చైతన్యం కలిగించే సాంస్కృతిక ప్రదర్శనలు. మన ఆంధ్ర భాష వారసత్వ సంపదగా వున్న హరికథ, బుర్ర కథ , పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు.

చలన చిత్ర ప్రముఖులతో, బుల్లి తెర నటీ నటులతో సంగీత, సాంస్కృతిక వినోద కార్యక్రమాలు.

వేయి మంది కవులతో కవి సమ్మేళనం :

శ్రీ జాషువా & కరుణశ్రీ వేదికపై వేయి మంది కవులతో మన అమరావతి కి, తెలుగు తల్లికి ఆంధ్ర మేవ జయతే అని తపియిస్తూ కవితా నీరాజనం.

సాహితీ సదస్సుల యజ్ఞం

కవి శ్రీనాధ వేదికపై తెలుగు సాహిత్యంలోని అతిరథ మహా రధులైన రచయితలు, కవులు పాల్గొనగా నిర్వహించ బోతున్న 20 తెలుగు సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక సదస్సులు.

అవధాన వైభవం

ప్రతి రోజూ సాయంత్రం 7.30 లకు శ్రీ కొప్పరపు & తిరుపతి వేంకట కవుల కు నీరాజనంగా మహా అవధానులచే శ్రీ శ్రీనాధ మహాకవి వేదికపై అష్టావధాన కార్యక్రమాలు.

*200 మంది గాయకుల తో చలన చిత్ర గాన నీరాజనం *

శ్రీ ఘంటసాల & ఎస్.పీ.బాలు వేదికపై ప్రముఖ గాయనీ గాయకులచే తెలుగు తల్లికి కరోకె మాధ్యమంలొ చలన చిత్ర గీతాల గాన నీరాజనం.

*శ్రీ రామోజీరావు ప్రదర్శన ప్రాంగణం *

శ్రీ చెరుకూరి రామోజీరావు ప్రదర్శన ల ప్రాంగణం లో శ్రీ పురాతన నాణేలు, ఆంధ్ర శాసనాలు, తాళ పత్ర గ్రంధాలు, తెలుగు కార్టూన్లు, ప్రముఖ చిత్ర కారులు రూపొందించిన "మన అమరావతి" పై చిత్ర కళా ప్రదర్శనలు, పూర్వ గ్రామ్ ఫోన్ రికార్డులు, లేపాక్షి, ఏటికొప్పాక, మంగళ గిరి, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, కలం కారీ,హస్త కళల ప్రదర్శనలు. తెలుగు భాష వైభవాన్ని చాటే తెలుగు పుస్తకాల ప్రదర్శనలు. మన ప్రాచీన తెలుగు వంటకాలు, రుచులు అందించే వివిధ వాణిజ్య వ్యాపార భోజన శాలలు ఆయుర్వేద, గిరిజన ప్రాంత ప్రకృతి వన మూలికల ప్రదర్శనలు.

లఘు చలన ప్రదర్శనలు:

తెలుగు భాష గొప్ప తనంపై, వికాసం పై లఘు చలన చిత్ర ప్రదర్శనలు.

తెలుగు వెలుగుల శిల్పారామం:

"మహా శిల్పి" శ్రీ రాజ కుమార్ వడయార్ నేతృత్వంలో " మన తెలుగు వెలుగులు" శిల్ప కళా ప్రదర్శన.

ఆధ్యాత్మిక వేదిక దివ్య సౌరభం :

శ్రీ తూము నరసింహదాసు ఆధ్యాత్మిక వేదికపై చిదంబరం శ్రీ నటరాజ శివ గామి కళ్యాణం, శ్రీ శ్రీనివాస కళ్యాణం, శ్రీ ఘటీ వల్లీ దేవ సేన సుబ్రహ్మణ్య కళ్యాణముల నిర్వహణ, ప్రాచీన సనాతన ధర్మ పీఠాధిపతుల దివ్య సందేశాలు, ప్రముఖ కళాకారులచే ఆధ్యాత్మిక భక్తి గీతాల గానం, నృత్య ప్రదర్శనలు, ప్రముఖులచే ప్రవచన కార్యక్రమాలు.

నాద నీరాజనం

ప్రముఖ కర్ణాటక సంగీత గురువులు శ్రీ మోదు మూడి సుధాకర్ గారి నేతృత్వంలో 108 మంది సంగీత విద్వాంసుల చే తెలుగు వాగ్గేయ కారుల కృతులతో "మన దివ్య అమరావతి" గాన నీరాజనం.

ప్రాంగణంలో తెలుగు తేజాలు

జానపద కళలు తప్పేట గుళ్ళు, గరగలు, కోలాటం, కర్ర సాము ప్రాంగణ మంతా ప్రదర్శనలు. సంచార జాతుల కళా కారుల ప్రదర్శనలు.

అద్భుత ప్రత్యేక ఆకర్షణలు

శ్రీ రస రాజు రచనతో, డా.గజల్ శ్రీనివాస్ సంగీత , గానం తో తెలుగు వైభవం రూపొందించిన తెలుగు తోరణం, తెలుగు గడ్డపై విలసిల్లుతున్న మన పురాతన దేవాలయాల ఘన కీర్తి ని ఆవిష్కరించే " క్షేత్ర దర్శిని" నృత రూపకాలు ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి.

స్వాగత ద్వారాలు:

మహా సభల ప్రాంగణం లో శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య, శ్రీ వాసిరెడ్డి సంస్థానం ,, శ్రీ తరిగొండ వెంగ మాంబ, కవయిత్రి మొల్ల , డా. పి.వి.జి.రాజు , డా. దాసరి నారాయణ రావు స్వాగత ద్వారాల ఏర్పాట్లు. "ఒక పద్య మైన చదువుదాం! వేమన, భాస్కర, సుమతీ శతక పఠన శాలలు పురస్కారాలు & సత్కారాలు ప్రాచీన కవుల, రాజ వంశస్థుల వారసులకు, తెలుగు సంస్థలు, తెలుగు ప్రముఖులకు, పూర్ణ కుంభ ప్రతిష్టాత్మక పురస్కారాలు. తెలుగు భాషకు విశేష కృషి చేస్తున్న వారికి ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాలు

అతిథులుగా ఎవరు విచ్చేస్తున్నారు

సభలకు ముఖ్య అతిథులుగా ప్రస్తుత, పూర్వ ఉప రాష్ట్ర పతులను, సుప్రీం కోర్టు , హై కోర్టు న్యాయ మూర్తులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు , వివిధ రాష్ట్రాల మంత్రులు, శాసన సభ, శాసన మండలి అధ్యక్షులు, పార్లమెంటు, శాసన సభ , మండలి సభ్యులు, ప్రముఖ పారిశ్రమికవేత్తలు, వివిధ దేశాల దౌత్య వేత్తలు , చలన చిత్ర నటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రముఖ క్రీడా కారులు, శాస్త్ర వేత్తలు షుమారు 70 దేశాల నుండి తెలుగు సంఘాల ప్రతిినిధులు, భారత దేశంలోని వివిధ రాష్ట్ర లలోని తెలుగు ప్రజలు, సంస్థల ప్రతి నిధుల కలయిక . ప్రతి రోజూ షుమారు 40 వేల మందికి పైగా ప్రేక్షకులు తెలుగు మహా సభలకు హాజరు.